పసికందుకు స్పిరిట్ ఎయిర్ లైన్స్ బంపరాఫర్.. జీవితాంతం ఫ్రీ ప్ర‌యాణం...

 


స్పిరిట్ ఎయిర్ లైన్స్  ఓ పసికందుకు బంపరాఫర్ ఇచ్చింది. అదేంటంటే... విమానంలో పుట్టిన ఆ చిన్నారి కి జీవితాంతం విమానాల్లో ఫ్రీ గా ప్ర‌యాణించే ఆఫర్ ను ఇచ్చింది. వివరాల ప్రకారం..స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఫోర్ట్ లాడ‌ర్ డేల్ నుంచి డ‌ల్లాస్ కు వెళ్తున్న‌ది. ఈ విమానంలో ఓ గర్భవతి కూడా ఉంది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఆమెకు నొప్పులు రావడంతో వెంట‌నే ఎమ‌ర్జెన్సీ లాండింగ్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పటికే  పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే.. విమానంలో ఓ న‌ర్సు, పీడియాట్రీషియ‌న్ ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. ఇక ఈ విమానంలో పుట్టినందుకు గాను.. చిన్నారి కి జీవితాంతం విమానాల్లో ఫ్రీ గా ప్ర‌యాణించొచ్చ‌ని స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఆ చిన్నారికి ఈ స్పెష‌ల్ గిఫ్ట్ ను అంద‌జేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu