ఒక నెలలో 15 రోజులు సెలవులు వస్తే..

రోజూ ఆఫీసులకూ, స్కూళ్లకూ, కాలేజీలకూ వెళ్లేవారు అబ్బా రోజూ వెళ్లాలా.?? ఇవాళ సెలవొస్తే బావుండు అనిపిస్తుంటుంది. ఒక రోజు వర్కుండి..మరో రోజు సెలవుంటే . ఇలాంటి వారి కోరికను తీర్చేందుకు రెడీ అయ్యింది, ఈ ఏడాది అక్టోబర్ నెల. ఒకే నెలలో 5 శనివారాలు, 5 ఆదివారాలు, 5 సోమవారాలు, నాలుగు పండుగలు రావడం ఎప్పుడైనా చూశారా.? కనీసం విన్నారా..? ఈ సారి మీరు ఆ విచిత్రం చూడబోతున్నారు. కాకతీయ రాజుల కాలంలో జరిగిన ఆ వింత ఇప్పుడు మనల్ని పలకరించడానికి వస్తోంది. సరిగ్గా 863 సంవత్సరాల క్రితం అంటే 1153వ సంవత్సరంలో ఒకే నెలలో నాలుగు పండుగలు, 5 శనివారాలు, 5 సోమవారాలు, 5 ఆదివారాలు రాబోతున్నాయి. ఇదే నెలలో బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి వంటి పండుగలు వస్తున్నాయి. ఇక రెండో శనివారం కూడా కలిసి రావడంతో..స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవులే..సెలవులే. అంటే నెలలో సగం రోజులే వర్కింగ్ డేలన్న మాట.

 

ఆదివారాలు            :    2,9,16,23,30

సోమవారాలు          :    3,10,17,24,31
శనివారాలు            :    1,8,15,22,29
బతుకమ్మ, దసరా    :     అక్టోబర్ 11
పీర్ల పండుగ           :     అక్టోబర్ 12
దీపావళి               :     అక్టోబర్ 30

Online Jyotish
Tone Academy
KidsOne Telugu