సుప్రీం తీర్పును కూడా తోసిపుచ్చేందుకు కర్ణాటక సర్కార్...

 

కావేరి జలాలపై సుప్రీం కోర్టు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటకపై ఉందని, శాంతి భద్రతల అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని చీవాట్లు పెట్టింది. అయితే ఇప్పుడు సుప్రీం తీర్పును మరోసారి కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చేట్టు కనిపిస్తోంది. తమిళనాడుకు ఖచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే అన్న తీర్పుపై క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీం ఆదేశాల‌పై చ‌ర్చించిన క‌ర్ణాట‌క రాజ‌కీయ పార్టీలన్నీ త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయ‌రాద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో అఖిల‌ప‌క్షంలో వ‌చ్చిన అభిప్రాయాన్నే పాటించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మరి ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా తాము ముందుగా ఆదేశించినట్లే 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్ణాట‌క‌ విడుదల చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu