ఆ దమ్ము మోడీకి లేదు.. ఎందుకంత భయమో... కేజ్రీవాల్

 

కాంగ్రెస్ పార్టీ నిన్న ర్యాలీ నిర్వహించగా.. ఈరోజు జంతర్‌మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు అగస్టా కుంభకోణంపై ధర్నా చేపట్టి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు విసిరారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ లు అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. అగస్టా స్కాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్నాయి.. అంతేకాదు.. ఇటలీ కోర్టు కూడా సోనియా, అహ్మద్‌పటేల్‌ను దోషులుగా తేల్చింది..అయినా సోనియాపై చర్యలు తీసుకునే దమ్ము ప్రధాని మోడీకి లేదు.. సోనియా అంటే ప్రధానికి ఎందుకంత భయమని ఎద్దేవ చేశారు. రెండేళ్లలో అవినీతికి పాల్పడ్డ ఒక్కరిని కూడా మోడీ సర్కారు జైలుకు పంపలేదన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu