ఎన్టీఆర్ 'రామయ్య... 'యూట్యూబ్ రికార్డ్..!!
posted on Sep 2, 2013 12:05PM

ప్రస్తుతం తెలుగు సినిమాల హీరోల కన్ను యూట్యూబ్ పై కూడా పడింది. టాలీవుడ్ బడా హీరోల సినిమాల టిజర్లు, సాంగ్స్ యూట్యూబ్ లో ఎంతమంది చూసారో అన్నదాన్ని కూడా రికార్డుగా చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్య' చిత్రంలోని ఒక పాట టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా పాట ను రెండు రోజుల్లో 637,772 వ్యూస్ వచ్చాయి. దీనిని ఇప్పుడు రికార్డ్ గా చెబుతున్నారు. ఈ సినిమా ఆడియో ను ఈ నెల 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'లో ఎన్టీఆర్, సమంత జంటగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకుడు.