ఆయనకు తల్లి కాబోతున్న మీనా...?

 

పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త విశ్రాంతి ఇచ్చిన నటి మీనా, మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇటివలే మీనా నటించిన "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రం విడుదలయింది. అయితే మీనా ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా మీనాకు ఓ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో నటించే అవకాశం లభించింది.

అయితే ఈ చిత్రంలో మమ్ముట్టికి తల్లి పాత్రలో మీనా నటించబోతుంది. అసలే వయసులో తనకంటే దాదాపు 20సంవత్సరాలు పెద్దవాడైన మమ్ముట్టికి తల్లిగా నటించడం అనేది ఒక చాలెంజ్ లాంటిదే కావడంతో... ఈ పాత్రను ఓ సవాల్ గా తీసుకోని చేయనుందట. ఈ చిత్రంలో ఈషా తల్వార్ హీరోయిన్ గా నటిస్తుంది.

అదే విధంగా మరో చిత్రంలో మోహన్ లాల్ కు భార్య పాత్రలో మీనా నటిస్తుంది. మరి ఈ ఇద్దరు పెద్ద హీరోల చిత్రంలో నటిస్తున్నమీనాకు ఎలాంటి విజయం దక్కుతుందో త్వరలోనే తెలియనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu