అంత సీన్ ఉందా..?
posted on Aug 31, 2013 7:45AM

గతంలో చాలా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రమ్య శ్రీ ఇప్పుడు దర్శక నిర్మాత గా మారి తానే ప్రదాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించింది. అయితే చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూస్తున్న ఈ సినిమాపై ఆస్కార్ ఆశలు పెట్టుకుందిట రమ్య శ్రీ..
చాలా సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తూనే కాసత్ ఎరోటిక్ సీన్స్‌తో కూడా అందరికి గుర్తుండి పోయిన బోల్డ్ యాక్ట్రస్ రమ్యశ్రీ. ఏ గ్రేడ్ సీన్స్‌కే పరిమితం అవుతుందనుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ మీదే ఆశపడుతుంది. ఇన్నాళ్లు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన రమ్య ఇప్పుడు తొలిసారిగా ఓ లీడ్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. అంతేకాదు ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాణ బాద్యతలు కూడా తానే నిర్వహిస్తుంది.
కథ మీద ఉన్న నమ్మకంతో అన్ని బాద్యతలు తానే నిర్వహిస్తున్నా అంటున్న రమ్య త్వరలో ఈసినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఇంకా రిలీజ్ కాని ఈ సినిమాపై రమ్య భారీ ఆశలే పెట్టుకుంది. ఓ మల్లి పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రమ్య శ్రీ గిరిజన యువతిగా నటిస్తుంది. పర్ఫామెన్స్‌కు ఎంతో స్కోప్ ఉన్న క్యారెక్టర్లో రమ్య తనలోని టాలెంట్ అంతా చూపించిందట.
తన నటన మీద నమ్మకమో లేక సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్సో గాని ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశపెట్టుకుంది రమ్యశ్రీ. భారీ ఫాలోయింగ్ పెద్ద దర్శకుల సినిమాలే ఆస్కార్ రేసులో నిలబడలేక పోతుంటే తన సినిమా కు ఆస్కార్ వస్తుందనటంపై అందరూ నవ్వుకుంటున్నారు. ఆస్కార్ దాకా ఎందుకు కాని కనీసం తెలుగు లో నంది అవార్డు అయిన వస్తుందొ లేదో అని సెటైర్స్ వేస్తున్నారట.