ఎన్టీఆర్ 'బాద్ షా' టీజర్ వాయిదా

 

 

NTR Baadshah Teaser Trailer, Baadshah Teaser, Baadshah Trailer

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా'ఆడియో ఫంక్షన్ వాయిదా పడడంతో శివరాత్రి కానుకగా అభిమానులకు మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఇది కూడ వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడడంతో ఈ మూవీ రచయిత గోపీమోహన్ వివరణ ఇచ్చారు.

 

'బాద్ షా' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ల టైట్ షెడ్యూల్ కారణం వల్ల క్వాలిటీ లేని టీజర్ ని విడుదల చేయకూడదని బాద్షా టీం నిర్ణయించుకుంది. అభిమానులందరికీ థియేటర్స్ లో గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని 'బాద్ షా' యూనిట్ ప్రామిస్ చేస్తోంది. మార్చి 17న జరగబోయే ఆడియో ఫంక్షన్ కి టీం ప్రిపేర్ అవుతోందని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu