ఇండియాలో చిత్రాన్ని నిర్మించనున్న స్టీవెన్ స్పీల్ బెర్గ్

ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇండియాలో హాలీవుడ్ సినిమాని ఇండియాలో రీమేక్ చేయాలని ఉందని తెలిపారు. పాత్రికేయులతో తన మనసులోని మాటను ఇలా చెప్పారు "ఏదో ఒక రోజున అమెరికాలో తయారైన సినిమాను ఇండియాలో రీమేక్ చేస్తానని, ఇండియా డైరెక్టర్, ఇండియా స్క్రిప్ట్ రైటర్, ఇండియా నటీనటులను, సాంకేతిక నిపుణులతో ఒక ప్రయోగం చేస్తానని'' చెప్పారు. అమితాబ్ బచ్చన్, రిలయెన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ తో స్టీవెన్ స్పీల్ బెర్గ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ నిర్మాణసంస్థ డ్రీం వర్క్స్, అనిల్ అంబానీ రిలయన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu