ఎన్టీఆర్ 'బాద్ షా' పై భారీ అంచనాలు
posted on Mar 29, 2013 12:21PM
.jpg)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దూకుడు తరువాత శ్రీను వైట్ల చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో ఏది తక్కువైనా ఫ్యాన్స్ నిరాశ చెందే అవకాశం వుంది కాబట్టి, ఈ సినిమాలో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా శ్రీను వైట్ల జాగ్రతలు తీసుకున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో సరైన స్టెప్పులేసి చాలా కాలం అవుతోంది. 'బాద్ షా' తో తారక్ ఆలోటును తీరుస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తన పంచ్ డైలాగ్స్, డాన్సులతో అభిమానులకి ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. దూకుడు సినిమాలో లాగే బాద్ షా లో బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ తమ కామెడీతో అలరిస్తారని అంటున్నారు. అయితే చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆకలితో ఉన్న యంగ్ టైగర్ ఈ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని చెబుతున్నారు.