యాక్టర్ హర్షవర్ధన్ తో జ్వాలా గుత్తా డేటింగ్?

 

 

 Jwala Gutta Dating Harshavardhan, Harshavardhan Jwala Gutta, Jwala Gutta affair

 

 

‘గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా సినిమా రిలీజ్ కి ముందే క్రేజ్ ను సంపాదించుకుంది. నితిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న జ్వాలా మరో హీరో తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా క్రీడాలకు దూరంగా వుంటూ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, హీరో హర్షవర్ధన్ రాణే తో డేటింగ్ చేస్తో౦దంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

 

తెలుగులో తకిట,తకిట..అవును అనే సినిమాల్లో నటించిన ఈ హ్యాండ్ సమ్ హీరో.. జ్వాలా గుత్తా తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని సమాచారం. ఈ అమ్మడు ఆడియో ఫంక్షన్ కి, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన ఈ హీరో వెంట ఉండాల్సిందేనని అంటున్నారు. ఈ విషయం గురించి హర్షవర్ధన్ ను అడిగితె..మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్పితే మరేమీలేదని అన్నారు. మరి ఈ వార్తలపై  జ్వాలా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu