ఏప్రిల్ లో అల్లు శిరీష్ ‘గౌరవం’ మూవీ
posted on Mar 28, 2013 5:39PM

అల్లు శిరీష్ హీరోగా అరంగేట్రం చేస్తున్న మూవీ ‘గౌరవం’. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గౌరవం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ నిర్మాణంలో రాధామోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో సాగుతుంది. తమిళ్, తెలుగు బాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తెస్తారని తెలుస్తోంది. విక్కీ డోనర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..గౌరవ౦ సిటీకి, పల్లెటూరికి మధ్య నాగరికత తేడాను చూపే చిత్రమని, ఇందులో అల్లు శిరీష్, యామీ గౌతమ్ పాత్రలకు మంచి పేరు వస్తుందని అన్నారు. తమన్ సంగీతం, సినిమాటోగ్రాపి ప్రధాన ఆకర్షణ నిలుస్తాయని చెప్పారు.