భారీగా ఖర్చు పెడుతున్న బండ్ల గణేష్
posted on Mar 4, 2013 2:52PM

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు బోల్తా పడుతున్న నిర్మాతలు ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు. ఒక్క సినిమా హిట్టయితే చాలు, భారీ నిర్మాతగా పేరు తెచ్చుకోవడానికి ఎక్కువగా ఖర్చు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అతని మొదటి రెండు సినిమాలు బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన, గబ్బర్ సింగ్ హిట్ తో కోలుకున్నాడు.
అయితే పవర్ స్టార్ ఇచ్చిన హిట్ మహిమో! ఇంకేదో..తెలియదు కాని, తాను ప్రస్తుతం నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాకి మాత్రం తెగ ఖర్చు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వేసుకున్న సూట్ కుట్టేందుకు వినియోగించిన వస్త్రం ఖరీదు మీటరుకు రూ.లక్ష లెక్కన కొనుగోలు చేశాడట. ఈ చిత్రంలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కి రూ.3.5 కోట్లు ఖర్చుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఈ సినిమా బడ్జెట్ ఎప్పుడో దాటేసిందట. మరి సినిమా హిట్టయితే పర్వాలేదు..కాని.. .మీరే కంప్లీట్ చేయండి!