భారతీయ నగరాలకు ఉగ్రదాడుల ప్రమాదం
posted on Oct 17, 2014 11:55AM
.jpg)
అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారతదేశంలోని నగరాలపై దాడి చేసే ప్రమాదం ఉందని నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి) హెచ్చరించింది. అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని నగరాలపై సంయుక్తంగా దాడికి దిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ‘‘భారతదేశం మీద దాడి చేయాలన్న తమ ఉద్దేశాన్ని వారు (అల్‌ఖైదా) ఇప్పుడు బయటపెట్టారు. వారు లష్కర్ ఎ తోయిబా, ఐఎస్‌ఐఎస్, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి దాడికి దిగే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎన్ఎస్‌జి డైరెక్టర్ జనరల్ జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు ఉమ్మడి ఆపరేషన్లకు దిగితే మన నగరాలలో, ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గోవా, బెంగళూరు, అమృత్‌సర్ వంటి భారత నగరాలపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని జయంత్ చౌదరి వివరించారు.