నిర్భయ్ క్షిపణి దూసుకెళ్ళింది

 

భారత సైన్యాధికారులు సరికొత్త క్షిపణి ‘నిర్భయ్’ని విజయవంతంగా ప్రయోగించారు. ఒరిస్సాలోని బాలాసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. నిర్భయ్ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల దూరంలోని లక్షాన్ని కూడా విజయవంతంగా ఛేదించగలుగుతుంది. తనపైకి దాడి చేసిన క్షిపణుల నుంచి కూడా చాకచక్యంగా తప్పించుకుని వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించడం ఈ నిర్భయ్ క్షిపణికి వున్న ఒక  ప్రత్యేకత.