రెండువేల నోట్లు కూడా రద్దు చేయాలి..


అవినీతిని అరికట్టాలన్న నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు వేల నోట్లను కూడా రద్దు చేయమని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో హవాలా కుంభకోణం బయటపడిన నేపథ్యంలో.. దీనిపై స్పందించిన చంద్రబాబు గతంలో రూ.వెయ్యి, 500 నోట్లను రద్దు చేయాలని కోరాం. ఇప్పుడు రెండు వేల నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నాం... అవినీతిపరులు స్వేచ్ఛగా చలామణి అవుతుండటంతో.. వారు పెట్రేగిపోతున్నారన్నారు. సూట్‌కే్‌సల కంపెనీలు పెట్టి రూ.1369 కోట్లు దోచుకుంటున్నారంటే ఏమిచేస్తే తనకేమవుతుందనే లెక్కలేని తనం ఎక్కువైందన్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu