దాద్రీ హత్య కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

 

దేశంలో కలకలం సృష్టించిన దాద్రి హత్య కేసులో పోలీసులు నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న మొత్తం 15 మంది పేర్లను చార్జి షీట్ లో చేర్చారు. భీమ, పునీత్ అనే మరో ఇద్దరు నిందితులను నిన్ననే అరెస్ట్ చేసారు. పరారిలో ఉన్న సచిన్, పునీత్ అనే మరో ఇద్దరు విద్యార్ధుల కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. వారు దొరకగానే ఆ నలుగురిపై కూడా అనుబంధ చార్జ్ షీటు దాఖలు చేస్తామని నోయిడా సర్కిల్ ఇన్స్పెక్టర్ అనురాగ్ సింగ్ తెలిపారు. గౌతంబుద్ధ నగర్ లో ఉన్న జిల్లా కోర్టులో పోలీసులు నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసారు. దానిలో బీజేపీ నేత సంజయ్ రాణా కుమారుడు విశాల్ పేరు కూడా ఉంది. అలాగే ఈ నేరంలో ఒక మైనర్ కూడా పాల్గొన్నట్లు అనురాగ్ సింగ్ తెలిపారు. ఈ చార్జ్ షీట్లో విశేషమేమిటంటే దానిలో ఎక్కడా బీఫ్ అనే పదం పోలీసులు వాడలేదు. నిజానికి మొహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ‘బీఫ్’ తిన్నాడనే కారణంగానే ఈ హత్య జరిగింది.

 

సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రి అనే గ్రామంలో ఒక ఆవు దూడ మాయం అయినట్లు ప్రచారం జరిగింది. అదే ఊరులో నివసిస్తున్న 52 ఏళ్ల వయసు గల మొహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆ ఆవు దూడని చంపి వండుకొని తింటున్నాడనే అనుమానంతో కొందరు దుండగులు అతని ఇంటిపై దాడి చేసి అతికిరాతకంగా కొట్టి చంపేసారు. తాను ఆవు మాంసం తినలేదని తనను విడిచిపెట్టమని ఆయన ఎంతగా ప్రాదేయపడినా వారు పట్టించుకోకుండా కొట్టి చంపారు. ఆ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యేయి. ఇంకా అక్కడే ఉన్నట్లయితే తమ ప్రాణాలకి కూడా ప్రమాదమని బావించిన అఖ్లాక్ కుటుంబ సభ్యులు చెన్నైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న పెద్ద కుమారుడు దగ్గరకు తరలి వెళ్ళిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu