అదానీ అంశం లేవనెత్తినందుకే.. ప్రియాంక

గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడమే బీజేపీ నేతల పనిగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వధేరా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంటు అనర్హత వేటు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అదాని అంశాన్ని లేవనెత్తినందుకే రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు తెరపైకి వచ్చిందని అన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీపై పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టులో స్టే ఉందని ప్రియాంక అన్నారు. అదానీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తినందుకే పరువునష్టం దావా తెరపైకి వచ్చి వేగంగా విచారణ పూర్తై తీర్పు కూడా వచ్చేసిందని ప్రియాంక ఆరోపించారు.

 అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురిచేసినా తన సోదరుడు రాహుల్ అన్యాయానికి తలవంచడని ప్రియాంక తేల్చిచెప్పారు. అయనా గాంధీ కుటుంబాన్ని  విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని,   అయినా కూడా ఏ జడ్జి కూడా వారికి రెండేళ్ల శిక్ష విధించరని, వారిపై అనర్హత వేటు పడదని ప్రియాంక అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu