కేబీఆర్ ఘటన మీద కేసీఆర్ స్పందన
posted on Nov 19, 2014 12:01PM

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ దగ్గర అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి మీద బుధవారం ఉదయం జరిగిన కాల్పుల సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం సభలో చర్చ పెట్టాలని కేసీఆర్ అన్నారు. కాల్పుల ఘటన మీద ప్రకటన చేస్తామని తెలిపారు. ఇదిలా వుండగా ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాన్ని, సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిత్యానందరెడ్డిని పరామర్శించారు.