హీరో వెంకటేష్‌కి నోటీసులు

 

ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌కి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆయన చేసిన నేరం, పాపం ఏమిటంటే, ఆయన ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో తన స్థలంలో నిర్మాణాలు కడుతున్నారు. ఈ నిర్మాణాన్ని అనుమతి లేకుండా చేస్తున్నారంటూ జీహెచ్ఎంపీ సర్కిల్ 10 టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం నాడు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణాల మీద పది రోజులలోగా జీహెచ్ఎంసీకి వివరణ ఇవ్వాలని లేకపోతే నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu