లాలు కొడుకులకి శాఖలు కేటాయించిన నితీశ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిన్న రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నితీశ్ తోపాటు ఆయన మంత్రివర్గంగా 28 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈసారి ఆమంత్రి వర్గంలో లాలు కొడుకులు తేజ్ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి ప్రసాద్ లకు కూడా ఉండటం విశేషం.

జేడీయూ, ఆర్డేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అనుకున్న ప్రకారమే (4:4:2) పదవులు పంచుకోవడం జరిగింది. నితీశ్ కుమార్ కూడా భాగస్వామ్య పార్టీల నేతలకు సముచిత స్థానం కల్పించి అందరికీ న్యాయం చేశారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి కుమారులిద్దర్నీ బరిలోకి దించిన లాలూప్రసాద్ యాదవ్... నితీశ్ ప్రభుత్వంలో మాత్రం ప్రధాన భూమికను పోషించనున్నారు. కాగా లాలూ కొడుకుల్లో పెద్దవాడైన తేజ్ ప్రతాప్‌ యాదవ్ కి నితీశ్ ఆరోగ్యశాఖ కేటాయించారు. చిన్న కొడుకు అయినా తేజస్వి ప్రసాద్ యాదవ్‌కి రోడ్డు, భవనాల శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాను కల్పించారు. కానీ హోంశాఖను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu