నీతి ఆయోగ్ సమావేశం.. సీఎంలు డుమ్మా

 

భూసేకరణ బిల్లు నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అయితే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న భూసేకరణ బిల్లుకు అధికార ఎన్డీఏ ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలో రాష్టాల ఆమోదం కోసం ఎన్టీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం కొంత మంది నేతలు మాత్రం సముఖత చూపనట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు ఈ బిల్లులోని మార్పులను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఈ బిల్లుపై రాహుల్ గాంధీ పెద్ద హంగామా కూడా చేశారు. అయితే ఈ సమావేశానికి దేశంలోని కొంతమంది ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు హాజరవ్వగా.. కొంత మంది సీఎంలు హాజరుకాలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంతరి అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నందున ఈ సమావేశానికి హాజరు కావటం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి మహాపుష్కరాలు సందర్భంగా సమావేశానికి హాజరవలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu