నదుల అనుసంధానంతో ఉపయోగం.. చంద్రబాబు
posted on Jul 15, 2015 4:41PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నీటిప్రాముఖ్యత-నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నూతన ప్రాజెక్టులకు నాంది పలికిన కేఎల్ రావు రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒక స్ఫూర్తి ప్రధాత కావాలని సీఎం ఆకాంక్షించారు. నదుల అనుసంధానంతో ఆర్ధికంగా ఎంతో ఉపయోగం ఉంటుందని.. నదులు అనుసంధానం చేసి ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చన్నారు. సముద్రంలో వృధాగా పోయే వెయ్యి టీఎంసీల గోదావరి నీటిని ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్‌ను కరువు నుంచి బయటపడేయ వచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు.