నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలపై నితీశ్ కుమార్.. ఉమ్మేసే పరిస్థితి వస్తుంది.

 

ఇప్పటికే పలు కట్టడాలకు, రోడ్లకు గాంధీ-నెహ్రూ కుటుంబాల పేర్లు పెట్టడంపై రిషీ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకారంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరుగుదొడ్డికి ఆయన పేరు పెట్టి పగ తీర్చుకున్నారు. ఇప్పుడు నితీశ్ కుమార్ కూడా రిషీ కపూర్ జాబితాలో చేరిపోయారు. నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలు పెట్టడం మానుకోవాలని.. విగ్రహాలు పెట్టుకుంటూ పోతే వాటిపై ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో రెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమి లేదని, వచ్చే మూడేళ్ల పాలనలోనూ పెద్దగా ఒరిగేదేం ఉండబోదని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu