బెజవాడలో ఇప్పుడు నైన్టీ బాటిల్ ఎంతో తెలుసా..?
posted on Jul 2, 2017 6:07PM

ఆంధ్రప్రదేశ్‌లో నైన్టీ బాటిల్ ఎంతో తెలుసా..? రూ.150 ఇదేదో కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ వల్ల అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రావడం, కొత్త వైన్స్ షాపుల ప్రారంభానికి పలు అవరోధాలు ఏర్పడటంతో మద్యం దొరకడం గగనంగా మారింది..దీంతో మద్యం ఉత్పత్తులకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడింది. దీంతో విజయవాడ, గుంటూరు జంట నగరాల్లో వైన్స్ షాపులు తీయగానే మందుబాబులు ఎగబడ్డారు..నైన్టీ బాటిల్‌ను రూ.150కి విక్రయిస్తూ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి వైన్స్ షాపుల యాజమాన్యాలు..అయినప్పటికీ చుక్క దొరికితే చాలు అనుకుని చెప్పిన రేటుకి కొంటున్నారు మందుబాబులు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కస్టమర్లను అదుపు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.