స్విస్ బ్యాంకుల్లో తగ్గుతున్న భారత్ వాటా

మనదేశంలో నల్లధనం అంటే వెంటనే గుర్తుచ్చే దేశం స్విట్జర్లాండ్. ఎవరినైనా అవినీతి కేసుల్లో పట్టుకుంటే స్విస్ బ్యాంకుల్లో సొమ్ము ఎంత ఉందో ఎంక్వయిరీ చేస్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే తాజా గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఇండియా వాటా నానాటికి తగ్గిపోతోందట...రికార్డు స్థాయిలో అది 45శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది..అంటే ప్రస్తుతం భారతీయుల నగదు నిల్వ 0.04 శాతం మాత్రమే ఉంది. 2007 వరకు స్విస్ బ్యాంకుల్లో అధికంగా డిపాజిట్లు చేసే మొదటి 50 దేశాల జాబితాలో భారత్ నిలిచింది. అయితే ఆ తర్వాత నల్లధనం వెలికి తీసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో భారతీయుల డిపాజిట్లు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu