మరో వివాదంలో సిద్దూ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు..సీఎం స్థానంలో ఉండి అభ్యంతరకర పదజాలంతో ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడి విమర్శల పాలయ్యారు. బెళగావిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ బెళగావి బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు కోల్పోయారో తెలుసా..? అంటూ ప్రజలను ప్రశ్నించారు..దానిపై మీరు ఓసారి ఆయననే అడగండి అంటూ సూచించారు. అసలు బ్లూఫిల్మ్ అంటే ఏమిటో మీకు తెలుసా..? ఎప్పుడైనా ఒక్కసారైనా దానిని మీరు చూశారా..? అంటూ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు అసెంబ్లీని దేవాలయంలా భావిస్తారు..అలాంటి చోట మీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడనన్నారు. అటువంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదు..వెంటనే దించేయాలన్నారు..చేసిన తప్పుకు ప్రతిగా రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. అయితే సాక్షాత్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోట బ్లూ ఫిల్మ్ అన్న మాట రావడంతో ఆ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu