మంగళగిరి మహిళలే తోబుట్టువులు.. జన హృదయాలను గెలిచిన లోకేష్
posted on Aug 10, 2025 8:05AM

నారా లోకేష్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతున్నారు. జనంలో మమేకం కావడం, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. వారిలో తానూ ఒకడినేనని తన చర్యలు, మాటలతో చాటుతున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా లోకేష్ శుక్రవారం (ఆగస్టు 9) మంగళగిరిలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి జాతీయ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా ముఖ్యంమంత్రి చంద్రబాబుతో పాటు మన్యం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొనాల్సి ఉంది. అయితే.. తన సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్న లోకేష్ మన్యం పర్యటనను స్కిప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నియోజకవర్గ మహిళలతో ఆయన రాఖీలు కట్టించుకున్నారు. మంగళగిరి నేత చీరలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్.. తనకు తోబుట్టువులు లేరనీ, అందుకే తపపే గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించి, అఖండ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి మహిళలే తనకు అక్క చెల్లెళ్లనీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఈ ఒక్క మాటతో ఆయన మంగళగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. లోకేష్ మంగళగిరిని ఓన్ చేసుకోవడం కాదు. మంగళగిరి ప్రజలే లోకేష్ ను ఓన్ చేసుకున్నారు. ఇందుకు నిదర్శనం.. నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో మహిళలు మంగళగిరి కార్యాలయానికి వచ్చి లోకేష్ కు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున క్యూలో నిలుచున్నారు. అలా తనకు రాఖీ కట్టేందకు వచ్చిన వారెవరినీ లోకేష్ నిరాశ పరచలేదు. గంటల తరబడి ఓపికగా నిలుచుని వారందరికీ తనకు రాఖీ కట్టేందుకు అవకాశం ఇచ్చారు.