పోసాని కూడా అందగాడేనా జగనూ?.. ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్న మాజీ సీఎం

విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు రోజులు గుడుస్తున్నా ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా వైసీపీలోని కమ్మ నేతల అందం గురించి మాట్లాడిన జగన్ ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్నారు.. ఆ ఎఫెక్ట్‌తో ఆయన తీరు వైసీపీ నేత‌ల‌కు, కార్యక‌ర్తలకే అంతుప‌ట్టడం లేదంట.  వాస్తవానికి జగన్‌కి ఉన్నంత ఇగో ఫీలింగ్, డామినేషన్ నేచర్ ఇంకే పొలిటీషియన్‌కి ఉండవన్న అభిప్రాయం ఉంది. ఓట్ల వర్షం కురవడానికి తన ఫొటో ఉంటే చాలు ఇంకెవరూ అక్కర్లేదన్నట్లు ఆయన వ్యవహార తీరు ఉండేది.
వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించారు అనడానికి  పలు ఉదంతాలు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్న వేదిక మీదే అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు. బడా ఇండస్ర్టియలిస్ట్ అయిన ఎస్పీవై రెడ్డి ఆజానుబాహుడు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో హుందాగా కనిపించే వారు. ఆయన వేదికపై జగన్ పక్కన నుంచోవడంతో సహజంగానే జగన్ కాస్తంత పొట్టిగా కనిపించి ఫిజికల్‌గా తేలిపోయారంట. దాంతో జగన్ వెంటనే అన్నా నువ్వు డయాస్ దిగు అని ఆ పెద్దాయన్ని వేదిక మీద నుంచి దింపే శారంట. ఈ ఉదంతాన్ని వైసీపీ సీనియర్లు, నంద్యాల నేతలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు.

అప్పట్లో సీని నటులు జీవితా, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి జగన్ కోసం ప్రచారం చేశారు. జగన్‌తో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు. అయితే రాజశేఖర్ తనదైన కాస్ట్యూమ్స్, మేకప్‌తో  వేదికపై తనను డామినేట్ చేస్తున్నారని జగన్ ఆ దంపతులను దూరం పెట్టేశారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రోజాకు కూడా అధికారిక కార్యక్రమాలకు మేకప్‌తో రావొద్దని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఆమె అసెంబ్లీలో, పార్టీ కార్యక్రమాల్లో ఒరిజినల్ గెటప్‌తో కనిపించారంట

అట్లాంటి జగన్ అధికారం చేజారగానే తన ఇగోలు, డామినేషన్‌లు పక్కన పెట్టి కొత్త రాగం ఎత్తుకుంటూ అభాసుపాలవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా దొరికిపోయి బెజవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్.. ఆ పరామర్శ పూర్తయ్యాక జైలు ముందే మీడియా ముందుకొచ్చారు .. చంద్రబాబు  తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వ‌ర్గంలో ఎవ‌ర్నీ పైకిరానివ్వరు.. అందుకే  రాజ‌కీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భనేని వంశీ, దేవినేని అవినాశ్ ల‌పై క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తున్నారని సరికొత్త రాగం ఎత్తుకున్నారు.

అంతవరకు ఓకే కాని జగన్ తన స్థాయిని కూడా మర్చిపోయినట్లు స్క్రిప్ట్‌లో రాసిచ్చిన డైలాగులు వల్లె వేసి అభాసుపాలయ్యారు. తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడిన జగన్ వాళ్లు అందగాళ్లని కితాబిచ్చారు.  చంద్రబాబు, లోకేశ్ కంటే వ‌ల్లభ‌నేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్ లు అందంగా ఉంటార‌ట‌. తమ సామాజికవర్గానికి చెందిన అలాంటి వాళ్ల రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే  చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంట ... అందులో భాగంగానే క‌క్షపూరితంగా వ‌ల్లభ‌నేని వంశీపై అక్రమ‌ కేసులు పెట్టార‌ట‌.. కొడాలి నాని, అవినాశ్ కూడా గ్లామర్‌గా ఉండ‌టంతో వారినీ త్వర‌లోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు.

అరెస్టుల పర్వంలో జగన్ లెక్కలు తప్పి ఇప్పుడు పోసాని కృష్ణమురళీ వంతు వచ్చింది. ఫోన్లో పోసాని భార్యను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్.. ఆ కేసు చూసుకోవడానికి తన న్యాయకోవిదుల్ని కూడా నియమించారు. అంతవరకు బానే ఉన్నా పోసాని గ్లామర్‌ను జగన్ ఎవరితో పోలుస్తారో అన్న సెటైర్లు మొదలయ్యాయి. పోసాని కూడా లోకేష్ కంటే అందగాడని అందుకే అరెస్ట్ చేశారని జగన్ ఎక్కడ స్టేట్‌మెంట్ ఇస్తారో? అని వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయంట.  అయినా మగవాళ్ల అందం గురించి అందునా రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎం  జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి, ఆఖరి మాజీ ముఖ్యమంత్రి జగనేనేమో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu