ముఖ్య సలహాదారుగా నీలం సహాని!!
posted on Dec 15, 2020 10:10AM
త్వరలో ముఖ్య సలహాదారు పోస్టును కొత్తగా సృష్టించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ పోస్టులో ఎవరిని నియమిస్తారు అనే విషయం తెలుసుకోవాలని ఉందా…డిసెంబరు మాసాంతానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని రిటైర్డు కాబోతున్నారు. ఆమెను ముఖ్య సలహాదారు పోస్టులో నియమించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానిని నియమించే ముందు తనకు ఆరు నెలలు సర్వీసు మాత్రమే ఉందని.. మరో ఆరు నెలలు సర్వీసు పొడిగింపు ఇవ్వాలని.. కోరినట్లు.. అందుకు జగన్ అంగీకరించినట్లు ప్రచారం అయింది. చివరకు ఆ ప్రచారమే వాస్తవం అయింది. నీలం సహాని సర్వీసు నుండి రిటైర్డు అయ్యాక కూడా మరో ఆరు నెలలు ఆమె సర్వీసు పొడిగింపుకు ముఖ్యమంత్రి జగన్ చేసిన సిపార్సును కేంద్రం అంగీకరించటం జరిగింది.