ఏబీకే ప్రసాద్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్
posted on Mar 1, 2023 5:44AM
పాత్రికేయ వృత్తిలో ఎందరో ప్రతిభామంతులైన జర్నలిస్టులకు గురువు అయిన ప్రముఖ సంపాదకుడు డాక్టర్ ఏబీకే ప్రసాద్ రాజా రాంమ్మోహన్ రాయ్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని ప్రధాన పత్రికలకు ఎడిటర్ గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఏబీకే ప్రసాద్ ఢిల్లీలోని డిప్యూటీ స్పీకర్ హాల్ లో మంగళవారం(ఫిబ్రవరి 28) జరిగిన ఒక కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
ఏబీకేగా ప్రసిద్ధి గాంచిన అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఏడున్నర దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో అగ్రగామిగా నిలిచారు. 2004-2009 మధ్య కాలంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా పని చేశారు.