మోడీ నామినేషన్ : శ్రీరామ పట్టాభిషేకం రోజునే..!

 

 

 

భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గుజరాత్‌లోని వదోదర పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో మోడీ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నాడు దేశవ్యాప్తంగా శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీరామ పట్టాభిషేకం రోజునే మోడీ నామినేషన్ దాఖలు చేయడం పట్ల బీజేపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఒక శుభసూచికగా భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత మోడీకి దేశ ప్రధానమంత్రిగా పట్టాభిషేకం జరుగుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu