సిక్కుల ఉచకోతపై బాధలేదా?
posted on Oct 26, 2013 12:04PM
.jpg)
తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తనను కోపానికి గురిచేసిందన్న రాహుల్ వ్యాఖ్యలపై మోడీ తన ప్రసంగంలో పలు సందేహాలు లేవనెత్తారు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం... ఈ కేసుల్లో ఒక్కరికీ శిక్ష పడకపోవడం కోపం తెప్పించిందో లేదో చెప్పాలని ప్రశ్నించారు.
‘ఇందిర హత్యపై కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహానికి గురవడం నిజమేనా? ఆ కోపంలో నీ పార్టీ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం, అయి నా ఒక్కరికీ శిక్ష పడకపోవడం నిజమేనా? నీ నానమ్మ మృతిపై నువ్వు ఆగ్రహానికి గురికావడాన్ని అర్థంచేసుకుంటా. కానీ వేలాదిమంది సిక్కుల మృతి పై నువ్వు బాధపడ్డావా? దీనిపై నీకు కోపం వచ్చిందా’ అని మోడీ ప్రశ్నించారు.
తాను కూడా హత్యకు గురవ్వచ్చన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కలకాలం చల్లగా ఉండేలా చూడమని బీజేపీ ప్రార్థిస్తుందని చెబుతూ.. ఉద్వేగభరితమైన అంశాలను ప్రస్తావించడం ద్వారా రాహుల్ ప్రజల ఉద్వేగాలను దోచుకునే యత్నం చేస్తున్నారన్నారు.