ముగిసిన నారాయణ స్వామి సిట్ విచారణ
posted on Aug 22, 2025 7:34PM

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సుదీర్ఘంగా సిట్ విచారించింది. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని ప్రశ్నిలించినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలు, లిక్కర్ స్కాంకు సంబంధించి పలు అంశాలపై విచారణ సాగినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాలు, నారాయణ స్వామి స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య కారణాల రిత్యా విచారణకు హాజరు కాలేనని సిట్ కు గతంలో నారాయణస్వామి తెలిపారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన నివాసంలోనే సిట్ విచారణ చేపట్టింది. గతంలోనే ఆయన తనకు ఎలాంటి సమాచారం లేదని .. కేవలం మంత్రిగా తాను అవసరమైతే సంతకాలు మాత్రమే చేసేవాడినని నారాయణ స్వామి వీడియో కాల్ ద్వారా విచారణ చేసినప్పుడు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
మరోవైపు లిక్కర్ స్కాం కేసులో తనపై వస్తున్న వదంతులను ఎవరు నమ్మొద్దని నారాయణ స్వామి తెలిపారు. నాపై అనేక అభూతకల్పనలు కొన్ని ఛానెళ్లు చేస్తున్నాయిని పేర్కొన్నారు. సిట్ విచారణకు పూర్తిగా సహకారించాని తెలిపారు. సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని ఆయన పేర్కొన్నారు