ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన సీఎం చంద్రబాబు
posted on Aug 22, 2025 6:37PM
.webp)
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి మద్దతు తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఆయనకు మా మద్దతు ఉంటుందని చెబుతూ అభినందనలు తెలిపాను. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ గౌరవం తీసుకొస్తారని సీఎం పేర్కొన్నారు.
ఎన్నికల ముందు నుంచి ఎన్డీయేలో తెలుగు దేశం పార్టీ ఉంది. ఆ అభ్యర్థికే మా మద్దతు ఉంటుందన్నారు. తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అవకాశం ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.