ఏంటేంటీ వైఎస్ఆర్సీపీ... కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనా!?
posted on Aug 22, 2025 9:17PM

వైసీపీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి.. మేం ఆ పార్టీకి అనుకూలంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేం అంటారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే మా పార్టీ అంటూ పులిహోర కలుపుతున్న బొత్స ఆ టైంలో ఉన్న పార్టీ కాంగ్రెస్.
ఇదిలా ఉంచితే, వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం ఏపీలోని కాంగ్రెస్ ది. ఇప్పటికి వైసీపీ కి ఉన్న 39. 5 ఓటు శాతం మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిష్టియన్ మైనార్టీ. వీళ్లంతా.. దాదాపు కాంగ్రెస్ సాలిడ్ ఓటు బ్యాంకే. ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర విభజనాంతరం తగిన ఆదరణ లేక పోవడంతో ఆ మొత్తం ఓట్ షేర్ మొత్తం వైసీపీకి వెళ్లిపోయింది. లిట్టరల్ గా మాట్లాడితే ఏపీలోని వైయస్ఆర్సీపీ ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ దే. ఇందులో నో డౌట్.
ఇంకో ముచ్చట ఏంటంటే ఎన్డీయే కూటమికి ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సరకు సరంజామా మొత్తం రెడీగా ఉంది. 788 మంది ఎలక్టోరల్ ఎంపీలుంటే, వారిలో 392 మంది సపోర్టు ఉంటే సరిపోతుంది. ఇప్పటికి 422 మంది మద్ధతు ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కి ఉంది. అంత ఉండి కూడా తిరిగి కేంద్ర బీజేపీ అధిష్టానం కేంద్ర మత్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా జగన్ కి ఫోన్ చేయించింది.
ఇదెక్కడి మతలబో అర్ధం కావడం లేదెవరికి. ఏంటీ దోబూచులాట? ఇప్పటికే జగన్ బెయిల్ మీద ఉండటానికి ప్రధాన కారణం బీజేపీతో ఆయన కి ఉన్న చీకటి ఒప్పందాలని అంటారు. మొన్న అమిత్ షా వచ్చినపుడు కూడా బాబు, పవన్ ముందు జగన్ బాగోగులు వాకబు చేశారు. మోడీ కూడా జగన్ గట్స్ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తారన్న టాకుంది.
ఇదంతా చూస్తుంటే, జగన్- బీజేపీ అవినాభావ సంబంధం ఏంటో ఇట్టే తెలిసి పోవడం లేదా? అంటారు కొందరు. ఆ మాటకొస్తే వచ్చే కొత్త పదవీచ్యుతి బిల్లు- జగన్ని కట్టడి చేయడం కన్నా బాబు, నితీష్ కోసమే ఇదంతా అంటూ ఏకంగా పార్లమెంటులోనే మార్మోగిన వైనం.
వీన్నిటిని బట్టీ చూస్తే.. ఎవరు ఏంటో ఇట్టే తెలిసి పోవడం లేదా? కాంగ్రెస్ ఓటు బ్యాంకు తన ఓటు బ్యాంకుగా మలుచుకుని.. కాంగ్రెస్ బ్లడ్ నరనరాన జీర్నించుకుని.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తామీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామంటే దీని భావమేమి బొత్సేశా! అంటున్నారు ఒక్కొక్కరూ. కారణం జగన్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం యాంటీ బీజేపీ. కానీ ఇక్కడ జగనన్న చూస్తే తన స్వార్ధ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి వైసీపీ ఓటర్లూ! అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.