ఇదిగో సాక్ష్యం.. దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి

 

కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోట టీడీపీ మీద విమర్శలు గుప్పించారు. టీడీపీ కోసం తాను ఎంతో చేశానని అలాంటిది ఆ పార్టీ తనను కనీసం గుర్తించలేదని వాపోయారు. టీడీపీలో అవమానించారని అందుకే పార్టీ మారుతున్నానని చెప్పుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న తనను టీడీపీ కనీసం పలకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తోట నరసింహం వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరామర్శించిన ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో లోకేష్ తోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఫోటోతో పాటు.. 'సాక్షి రాతలకు ఉండదు మనస్సాక్షి. అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి. దేనికైనా మసిపూసి చిటికెలో మారేడుకాయ చేస్తుంది. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు చెప్తుంది' అంటూ ట్వీట్ చేశారు. మెుత్తానికి తోట నరసింహం ఆరోపణలకు లోకేష్ ఆధారాలతో సహా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu