తెలంగాణలో ముక్కోడు పోయాడు.... ఏపీలో తిక్కోడు పోతాడు

తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి పవర్‌ఫుల్ పంచ్ వేశారు. పల్నాడులో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో అటు ముక్కోడి మీద ఇటు తిక్కోడి మీద పంచుల మీద పంచులు వేసి జనం పొట్ట పట్టుకుని నవ్వేలా చేశారు. ‘‘మొన్నటి వరకూ మా ముక్కోడు బాగా నీలిగిండు. ఇప్పుడు అక్కడ ముక్కోడు పోయిన తర్వాత ఇక్కడ వున్న తిక్కోడికి భయం పట్టుకుంది. మేం అక్కడ తిక్కోణ్ణి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తిక్కోణ్ణి ఇంటకి పంపించేయాల్సిన అవసరం వుంది. అందుకనే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, టూరిజానికి శాడిజానికి, విజనర్‌కి ప్రిజనర్‌కి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎటు వుండాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఇక్కడున్న తిక్కోడు 2104లో నాకు నాన్న లేడు అన్నాడు. జనం నమ్మారు. 2019లో నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని అడిగితే జనం ఇచ్చారు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగు పోయింది. బడిలో తెలుగు పోయింది. నదిలో ఇసక పోయింది. గుడిలో విగ్రహాలు పోయాయి. నేరాలు పెరిగిపోయాయి. ఘోరాలు జరిగిపోయాయి. పరిశ్రమలు పారిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. ఆస్తులు తరిగిపోయాయి. అమ్మకి గౌరవాధ్యక్ష పదవి పోయింది. చెల్లికి ఆస్తిపోయింది. బాబాయి పైకి పోయె.. బాబు జైలుకు పోయె’ అని నన్నూరి నర్సిరెడ్డి పంచులతో అదరగొట్టేశారు.