యురేనియం తవ్వకాలతో సాగర్‌కు ముప్పు ?
posted on Jul 28, 2012 12:08PM
నల్గొండ జిల్లా దేవరకొండలోని చందం పేట అడవుల్లో మళ్లీ యురేనియం కోసం తవ్వకాలను జరపటం స్థానికులను భయ బ్రాంతులను చేస్తుంది. ఇంతకు ముందు రెండేళ్లక్రితం గిరిజనుల ఉద్యమం చేపట్టడం ద్వారా కొంతకాలం తాత్కాలికంగా ఆపిన సంస్ధ మళ్లీ నమూనా సేకరణను యుసిఐఎల్ చేపట్టడం గిరిజనులను కలత పెట్టింస్తుంది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సాగర్‌రిజర్వాయరుకు సమీపంలో వేలాది ఎకరాల్లో యురేనియం నిల్వలున్నట్లు కనుగొన్నయసిఐఎల్ సంవత్సరం క్రితం మహబూబ్‌నగర్ జిల్లా తుమ్మలచెరువులో నమూనాలు సేకరించే ప్రయత్నం చేయగావారి బోరు యంత్రాలను స్ధానికులు అడ్డుకున్నారు.
తాజాగా 15 రోజుల నుండి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రాలగుట్టపై క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బోరు బావులనుండి శాంపుల్స్ సేకరించి పరిశోధన నిమిత్తం ముంబాయి పంపారని నిర్వాహకులు చెప్పారు. గతంలో ప్రజలు, పర్వావణ శాస్త్రవేత్తలు, స్వచ్చంద సంస్ధల ఆందోళనతో వెనక్కి తగ్గిన తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. పెద్దగట్టు ప్రాంతంలో యుసిఐఎల్ వారు వేసిన బోరునుండి నీటిని తాగిన మేకలు, బర్రెలు మృత్యువాల పడ్డాయి.సాగర్ నిర్వాసితుల పిఏ పల్లి , చందం పేటల వారు ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలోని తవ్వకాలు చేపట్టటంతో నిర్వాసితులకు నీడలేకుండా పోతుంది.
2007 సంవత్సరంలో తవ్వకాలకు నిరసనగా పర్యావరణ శాస్త్రజ్ఞులు, స్వచ్చంధ సంస్థలు చేపట్టిన పాదయాత్ర వల్ల సాగర్‌నీటిని కలుషితం కాకుండా, జీవనవైవిధ్యం దెబ్బతినకుండా చూశారు. వారు తమ సహాయాన్ని ఇప్పుడు కూడా ఇవ్వవలసిందిగా స్ధానికులు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతం లో యురేనియం ఫ్యాక్టరీ నెలకొల్పితే ప్రజలకు హానిక కలుగుతుందని, అలాగే సాగర్‌జలలు కలుషితం అవుతాయని స్వచ్చంధ సంస్థలు చెబుతున్నాయి. గిరిజనులను ప్రతిచోటా ఇదే విధంగా దోచుకుంటున్నారని, అటవీ సంపద తరిగి పోతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.