ఫ్లాప్ డైరెక్టర్ తో సునీల్ సాహసం

 

        కామెడియన్‌గా ఎంటరై హీరోగా మారిన నటుడు సునీల్‌, కామెడియన్‌ సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ హీరో, స్టార్‌గా ఎదగటానిక తెగ కష్టపడిపోతున్నాడు. అయితే ఈ క్రమంలో సునీల్‌ ఇప్పుడో భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు.

        ఫ్యామిలీ ప్యాక్‌ నుంచి సిక్స్‌ ప్యాక్‌ రేంజ్‌ కే కాదు కామెడియన్‌ నుంచి మంచి హీరోగా ఎదిగిన నటుడు సునీల్‌.. డిఫరెంట్‌ ఢిక్షన్‌తో పాటు మంచి టైమింగ్‌ ఉన్న సునీల్‌ కామెడియన్‌గానే కాదు హీరోగా కూడా మంచి సక్సెస్‌లను అందుకున్నాడు..
 
       అయితే హీరోగా చేస్తున్న సునీల్‌ను తన పాత వాసనలు మాత్రం వదిలి పెట్టడం లేదు. సిక్స్‌ప్యాక్‌తో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నా డైరెక్టర్‌లు మాత్రం కామెడీ కథలతోనే సునీల్‌ దగ్గరికి వస్తున్నారు. అందుకే వరసుగా అలాంటి సినిమాలే చేస్తూ వస్తున్నాడు.

        అయితే ఇప్పుడు ఆ మూస నుంచి బయటికి రావడం కోసం ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు సునీల్‌. షోడో లాంటి భారీ డిజాస్టర్‌ ఇచ్చిన మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడట.

        మెహర్‌ రమేష్‌ కెరీర్‌లో ఇంత వరకు ఒక్క సక్సెస్‌ కూడా లేదు.. తన డైరెక్షన్‌లో వచ్చిన బిల్లా కాస్త పర్వాలేదని పించినా అది రీమేక్‌ సినిమా కావడంతో ఆ క్రెడిట్‌ కూడా మెహర్‌కు దక్కలేదు. దానికి తోడు రీసెంట్‌గా షోడో ఫ్లాప్‌తో మెహర్‌రమేష్‌ సినిమా అంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారు.

        సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్న ప్రమోషన్‌ హీరో బిల్డప్‌ విషయంలో మెహర్‌ రమేష్‌ టాప్‌ అనే చెప్పాలి.. అందుకే అతని డైరెక్షన్‌లో సినిమా చేస్తే మాస్‌ ఇమేజ్‌ మూట కట్టుకోవచ్చని ఆశపడుతున్నాడు సునీల్‌..

        మరి సునీల్‌ సాహసం వర్క్‌ అవుట్‌ అవుతుందో లేక కథ అడ్డం తిరుగుతుందో చూడాలి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu