కేసీఆర్ ను ప్రశ్నించిన నాగం



నాగం జనార్ధనరెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. హైదరాబాదులోని బషీర్‌బాగ్‌లో తెలంగాణ బచావో కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభన చేసిన తరువాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా.. పేద రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. అయినా గుడుంబా తాగితే ఆరోగ్యం పాడవుతుందని.. మందు రేట్లు తగ్గించారు.. ఇప్పుడు ఛీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఎప్పటినుండో ఉన్న సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని.. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.


ఇదిలా ఉండగా నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ గుడ్ బై చెప్పి వేరే కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన ముందు తెలుగుదేశం పార్టీలో సీనీయర్ మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తరువాత బీజేపీలోకి మారారు. అయితే ఆపార్టీలో ఆయనకు సరైన ప్రాదాన్య లేకపోయేసరికి ఇప్పుడు వేరు కుంపటి ఏర్పాటు చేసుకుంటున్నారు. 'బచావో తెలంగాణ మిషన్' పేరిట ప్రజావేదిక ఏర్పాటవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu