జిమ్మిక్కులు పని చేయవు..సోనియాపై నాగం కామెంట్స్

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేసినా డిపాజిట్లు దక్కవని తెలంగాణ నగరా సమితి అధినేత నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్ ముందు ఏ జిమ్మిక్కులు పని చేయవన్నారు. నాగర్‌కర్నూల్‌తో పాటు.. తెలంగాణ ప్రాంతంలోని ఇతర నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, చివరకు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పోటీ చేసినా కూడా డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు.