గాలి కేసులో మిస్టరీ చేదించనున్న సిబిఐ

బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో భారీ మొత్తంలో జరిగిన నిధుల మళ్లింపుపై ఆరా తీయడానికి సిబిఐ అధికారులు మార్షియస్, వర్జిన్ ఐలాండ్స్ సందర్శించనున్నారు.గాలి సోదరులకు విదేశాల్లో ఆరు కంపెనీలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. చైనా కంపెనీలు చెల్లించిన డబ్బులను ఈ కంపెనీల ద్వారా మళ్లించినట్లు చెబుతున్నారు.దాంతో  ఫిబ్రవరి మొదటి వారంలో మార్షియస్, వర్జిన్ ఐలాండ్‌లతో పాటు ఇతర దేశాలకు వెళ్తామని సిబిఐ వర్గాలు చెప్పాయి. సిబిఐ అధికారులు బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించడమే కాకుండా హోస్పేటలోని ఆయన బినామీల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా చార్జీషీట్‌లో క్రోడీకరించిన ఆస్తులను సిబిఐ అధికారులు పరిశీలించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు డిసెంబర్ 3వ తేదీన చార్జిషీట్ దాఖలు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని, ఆయన బావ శ్రీనివాస రెడ్డిని, ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌ను, మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసింది. వారంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu