ప్రియ‌మైన మృత్యువా...!

ఎంత క‌ర‌డుగ‌ట్టిన మ‌నిష‌యినా, ఏదో ఒక సంద‌ర్భంలో త‌ను చేసిన దారుణాలు గుర్తుచేసు కుని త‌న‌ని తాను అస‌హ్యిం చుకుంటాడు. అప్పుడు మారే మ‌నిషిమంచి మ‌న‌సుతో స‌మా జంలో బ‌తికేందుకు అర్హుడ‌న‌ని భావిస్తాడు. చాలామంది బ‌య‌ టికి  చెప్పుకోలేని బాధ‌ల్ని డైరీ లుగా రాసుకున్నారు. యాసీ ర్ అహ్మ‌ద్ కూడా రాశాడు. జ‌మ్ము కాశ్మీర్ డీజీ(ప్రిజ‌న్స్‌) హేమంత్ లోహియా హ‌త్య‌ కేసు లో అను మానితునిగా పోలీసు లు అరెస్టు చేశారు. డిజీ లోహియా ఇంట్లో అహ్మ‌ద్ ప‌నివాడిగా ఆరు నెల‌ లుగా ప‌నిచేస్తున్నాడు. ఏ కార‌ ణం చేత‌నో ఆయ‌న్ను హ‌త్య‌చేసి శ‌వాన్ని త‌గ‌ల‌బెట్టాడు. ముందు గా ఆయ‌న గ‌దిలో లోప‌ల గ‌డియ‌ పెట్టి, ఆయ‌న్ను కుర్చీలో క‌ట్టేసి నూనె శ‌రీర‌మంతా రాసి క‌చెప్ సీసా పెంకుతో ఆయ‌న గొంతు కోశాడు. ఆ త‌ర్వాత దిండును కాల్చి ఆయ‌న మీద ప‌డేయ‌డంతో ఆయ‌న శ‌రీరం కాలిపోయింద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఆ సంఘ‌ట‌న తర్వాత‌నే అహ్మ‌ద్ పారిపోయాడు. అత‌న్ని కీల‌క స‌స్పెక్ట్ గా పోలీసులు ప‌ట్టుకున్నారు.
 
జైల్లో యాసిర్ అహ్మ‌ద్ చాలా దిగులుగా గ‌డిపాడన్న‌ది అత‌ను రాసిన డైరీ వివ‌రాలే చెబుతున్నాయ‌ని పోలీసులు అంటు న్నారు. ఇంత‌కీ డైరీలో ఏం రాశాడో తెలుసా..23 ఏళ్ల అహ్మ‌ద్ జీవితంలో ఏదో ఘోర త‌ప్పిద‌మే చేశాన‌ని గ్ర‌హించి బాధ‌తో కుమి లిపోయాడ న్న‌ది అర్ధ‌మ‌వుతుంది. చిత్రంగా అందులో బాలీవుడ్ పాట‌ల‌ను కూడా రాశాడు!

ఇలా రాశాడు... ప్రియ‌మైన మృత్యువా, నా జీవితాన్ని అస‌హ్యించుకుంటున్నాను, నేను నీ కోస‌మే ఎదురు చూస్తున్నాను. భులా దేనా ముఝే, హై అల్విదా తుఝే  అంటూ ఆషికీ 2 సినిమాలోని పాట‌లో ఒక పంక్తిని రాశాడు. అలాగే, నా జీవితాన్ని తిరిగి కొత్త‌గా ఆరంభించాల‌నుకుంటున్నాను అని రాశాడు. జింద‌గీతో బ‌స్ త‌క్లీఫ్ దేతీ హై, సుకూమ్ తో మౌత్ హీ దేతీ హై అని, రోజూ జీవితాన్ని ఎంతో ఆశ‌తో ఆరంభిస్తున్నాను, కానీ చాలా చెత్త అనుభ‌వంతోనే ముగుస్తోంది అనీ రాశాడు. అహ్మ‌ద్‌ను పోలీసు లు చాలా ప్ర‌య‌త్నాల త‌ర్వాత మంగ‌ళ‌వారం ప‌ట్టుకోగ‌లిగారు. 
 
త‌న జీవితం 99 శాతం డిప్ర‌ష‌న్ తో నిండింద‌ని, కేవ‌లం ప‌ది శాత‌మే ఆనందంతో ఉన్నాన‌ని, ప్రేమ అస్స‌లు లేద‌ని, జీవిత‌ మంత ఒత్తిడేన‌ని రాశాడు. జీవిత‌మంతా దుర్భ‌ర‌మ‌ని, అంతా క‌న్నీటితోనే సాగుతోంద‌ని చ‌నిపోవ‌డ‌మే మంచిద‌ని, ఆ త‌ర్వాత మంచి జీవితం ఆరంభించ‌డానికి వీల‌వుతుంద‌ని రాసుకున్నాడు. ఒక‌వేళ నిజంగానే యాసిర్ అహ్మ‌ద్‌కి జీవితం మీద ఇంత విర‌క్తే క‌లిగితే అత‌నిలో ఎంతో మార్పు నిజంగానే వ‌చ్చింద‌ని పోలీసులే కాదు అత‌ని చేతిలో చ‌నిపోయాడ‌ని అనుమానిస్తున్న హేమ‌త్ లోహియా కుటుంబీకులు క్ష‌మించేస్తారు. ఈ మార్పునే ఆశిద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu