ముస్లిం బాలికలు 15 ఏళ్ళకే పెళ్ళి చేసుకోవచ్చు

 

పదిహేనేళ్ళు నిండిన ముస్లిం బాలికలు పెళ్ళి చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ పదిహేనేళ్ళ కంటే ముందు రజస్వల అయిన బాలికలు కూడా వివాహానికి అర్హులేనని కోర్టు స్పష్టం చేసింది. ఆ బాలికలు ఏ మతానికి చెందిన వ్యక్తిని అయినా వివాహం చేసుకోవచ్చని ముస్లిం పర్సనల్ లాని ఉటంకిస్తూ కోర్టు పేర్కొంది. ముస్లిం బాలికలు పెళ్ళి చేసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది. పదిహేడేళ్ళ వయసున్న ఓ ముస్లిం బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకుంది. ఆ బాలిక తల్లిదండ్రులు మైనర్ని వివాహం చేసుకున్నాడంటూ ఆ బాలిక భర్త మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు మీద విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu