ముంబై పేలుళ్ల కేసు.. మరో వ్యక్తి అరెస్ట్

 

ముంబై వరుస పేలుళ్ల సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితమే ఈ కేసును విచారించిన టాడా కోర్టు కొంతమందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. అబుసలెం, ముస్తాఫా దోసా సహా ఆరుగురు వ్యక్తులను ప్రత్యేక టాడా కోర్టు దోషులుగా నిర్ధారించి... శిక్ష ఖరారు చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో వ్యక్తిని కోర్టు నిందితుడిగా గుర్తించింది. ఖాదిర్‌ అహ్మద్‌ అనే వ్యక్తిని టాడా కోర్టు నిందితుడిగా గుర్తించింది. అయితే గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న అహ్మద్‌ను యూపీలోని నజిబాబాద్‌ ప్రాంతంలో అరెస్టు చేశారు. కాగా 1993 లో జరిగిన ఈ పేలుళ్లలో దాదాపు  257 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu