16 ఏళ్ల యువకుడు 71 ఏళ్ల బామ్మతో ప్రేమ పెళ్లి..!

 

ప్రేమకు వయసుతో పనిలేదు అని.. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ ఏ వయసులో పుడుతుందో.. ఎవరి మీద పుడుతుందో తెలీదు.. ఓ.. ఇలాంటి డైలాగులు ఎన్నో వింటుంటాం. కానీ ఇప్పుడు జరిగిన ఓ ఘటన చూస్తే మాత్రం ఈ మాటలు నిజమనిపిస్తోంది. 16 ఏళ్ల బాలుడు 71 ఏళ్ల వృద్ధురాలిని  వివాహంచేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఘటన ఇండోనేషియా జరిగింది. ఇండోనేషియాలోని నైరుతి సుమత్రా, కరన్‌గెండా గ్రామంలో సేలమత్ రియాది అనే 16 ఏళ్ల యువకుడు 71 ఏళ్ల రోహయా అనే బామ్మతో పరిచయం ఏర్పడింది. అదేం విచిత్రమో.. ఆ పరిచయం కాస్త స్నేహం గా మారి.. ఆతరువాత ప్రేమగా మారిందట. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదండోయ్ ఆ బాలుడి ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోక‌పోయినా, ఆ బామ్మ ఇంట్లోని కుటుంబస‌భ్యులు అంగీక‌రించ‌క‌పోయినా ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని మరీ బెదిరించారట ఈ ఆ జంట. దీంతో ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వ‌ధూవ‌రులిద్ద‌రూ ఏక‌మ‌య్యారు. మొత్తానికి ప్రేమకు వయసుతో పనిలేదని ఈ జంట నిరూపించింది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu