అంగీకరించే ప్రసక్తే లేదు : ములాయం

 

Mulayam Singh Telangana, Mulayam Singh against Telangana

 

 

తెలంగాణ పై కాంగ్రెస్‌ తేల్చేస్తుంది అన్న ఊహాగానాల మధ్య ములాయం మరో బాంబు పేల్చారు..తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరూకమని చెపుతూనే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ని అభినందించారు. చిన్నరాష్ట్రాల వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుందన్నారు.

 

అసలు కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మొగ్గు చూపుతుందో అర్ధంకావటం లేదని.. తెలంగాణ ఏర్పాటు జరిగితే మరిన్ని రాష్ట్రాల్లో అలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నారు.. ఇప్పటికే తెలంగాణ నేపధ్యంలో గుర్ఖాలాండ్‌లో కూడా మరోసారి ఉద్యమాలు ఊపందుకున్నాయి.. ఇలాంటి పరిణామాలే మరిన్నిజరుగుతాయని ములాయం అభిప్రాయపడ్డారు..



ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, బీహార్‌ నుంచి జార్ఖండ్‌ను వేరుపడగా ఇప్పుడు ఆ రాష్ట్రల ప్రగతి కుంటుపడిందని, కాబట్టి అక్కడి పరిస్ధితులను సమీక్షించుకొని రాష్ట్ర ఏర్పాటులో ముందడుగు వేయాలని కోరారు.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించమన్న ములాయం పార్లమెంట్‌లో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామన్నారు.