31న యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్‌

 

 Congress Core Group meeting, Crucial Congress Working Committee meet

 

 

తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు.


ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. ఈ నెల 31న యుపిఎ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమవేశంలో భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అభిప్రాయాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునేందుకు  రెడీ అవుతుంది.

ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.