రాష్ట్రపతి ఎన్నికలు.. మొదటి ఓటు చిరంజీవిదే..
posted on Jun 29, 2017 12:26PM
.jpg)
వచ్చే నెల రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రకటన జరిగిపోయింది. ఇక ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్దిగా రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించగా.. విపక్ష పార్టీలు మీరా కుమార్ ను ఎంపిక చేశాయి. ఈ నేపథ్యంలో మీరా కుమార్ నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఎన్నికల ఓటర్ల జాబితా కూడా సిద్దమైపోయింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్న అభ్యర్థుల జాబితాతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రూపొందింది. ఈ ఎన్నికల్లో తొలి, చివరి ఓటర్లు తెలుగువారే కావడం విశేషం. ఈ జాబితా ప్రకారం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేయనున్నారు. చివరి ఓటును యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు పేరు చిట్టచివర ఉంది. మొత్తానికి చిరంజీవికి తొలి ఓటు దక్కడం విశేషమే.